: మరో రసాయనిక దాడికి సిరియా సిద్ధమవుతోంది.. ఈసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: అమెరికా సీరియస్ వార్నింగ్

రసాయనిక దాడులతో సిరియాను రక్తసిక్తం చేస్తున్న ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ మరోసారి అదే తరహా దాడికి సిద్ధమవుతున్నాడని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి రసాయనిక దాడికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బషర్ కు వార్నింగ్ ఇచ్చింది. బషర్ పాలనలో మరో భారీ కెమికల్ అటాక్ జరగనుందని... ఈ దాడి భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకోనుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ షాన్ స్పైసర్ తెలిపారు. ఏప్రిల్ లో సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది అభంశుభం తెలియని చిన్నారులే ఉండటం ప్రపంచ వ్యాప్తంగా ఆవేదనకు కారణమైంది.

More Telugu News