: పోలీసులు అబద్ధం చెబుతున్నారు.. అందుకు సాక్ష్యం ఇదే!: శిరీష పిన్ని

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో పోలీసులు మొదటి నుంచీ తప్పుదోవపట్టిస్తున్నారని శిరీష పిన్ని ఆరోపించారు. ఒక టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, పోలీసులు ఆరంభం నుంచి ఆత్మహత్య అంటూనే వాదిస్తున్నారని ఆమె చెప్పారు. శీరీష పోస్టు మార్టం త్వరగా పూర్తి చేయాలని తొందరపెట్టింది, అంత్యక్రియలు నిర్వహించాలని తొందరపెట్టిందీ పోలీసులేనని ఆమె అన్నారు.

ఇక పోలీసులు అబద్ధం చెబుతున్నారనడానికి అతిపెద్ద సాక్ష్యం ఏంటంటే... సెల్ ఫోన్ లో లొకేషన్ ను షేర్ చేస్తే ఆ సమీపంలోని టవర్ లొకేషన్ ను మాత్రమే అది షేర్ చేస్తుందని, వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని చూపించదని, అందుకే ఆమె సెల్ ఫోన్ ద్వారా తన భర్తకు పంపిన లొకేషన్ కుక్కునూరుపల్లి ఫాంహౌస్ దగ్గర్లోని టవర్ లోకేషన్ చూపిస్తోందని పోలీసులు చెబుతున్నారని; అలా టవర్ లొకేషన్ షేర్ చేస్తే, మనం ఎక్కడున్నామనే లొకేషన్ ను సెల్ ఫోన్ ఎలా చెబుతుందని, టవర్ లొకేషన్ చూపించాలి కానీ, సెల్ ఫోన్ ఎక్కడ ఉందన్న లొకేషన్ చూపించకూడదు కదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ ఒక్క విషయం గురించి ఆలోచిస్తే పోలీసులు ఎంత నిజాలు మాట్లాడుతున్నారో తెలుస్తుందని ఆమె తెలిపారు.

More Telugu News