: తన్నీర్ తన్నీర్: 140 ఏళ్లలో చెన్నై వాసులు ఎదుర్కొంటున్న కనీవినీ ఎరుగని నీటి ఎద్దడి!

చెన్నై వాసులు గుక్కెడు తన్నీర్ (నీటి) కోసం తహతహలాడుతున్నారు. గత 140 ఏళ్లలో చవిచూడని నీటి ఎద్దడిని చెన్నై నగరం ఇప్పుడు ఎదుర్కొంటోంది. 2015లో వరదలతో నీటమునిగిన చెన్నై పట్టణం...సరిగ్గా రెండేళ్లు గడిచేసరికి నీటి ఎద్దడితో ఆందోళన చెందుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ఆకాశహర్మ్యాలు, పెరిగిపోయిన తాగునీటి అవసరాల నేపథ్యంలో చెన్నైకి తాగునీరుని అందిస్తున్న 4 జలాశయాలూ వట్టిపోయాయి. దీంతో 3 రోజులకొకసారి వచ్చే కుళాయి నీటితోనే చెన్నైవాసులు సరిపెట్టుకుంటున్నారు.

  చెన్నై వాసులకు ఒక రోజుకు 830 మిలియన్ల తాగునీరు అవసరం కాగా, పూండి, రెడ్‌ హిల్స్‌, చోళవరం, చెంబరంబాక్కం జలాశయాలతోపాటు, చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరాణం చెరువు చెన్నై నీటి అవసరాలు తీరుస్తున్నాయి. అయితే వీరాణం చెరువు పూడిక సరిగ్గా తీయకపోవడంతో దాని నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. దీంతో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో వివిధ పట్టణాల్లో నీటి వ్యాపారం ఊపందుకోగా, చెన్నైలో ఈ వ్యాపారం మరింత జోరుగా సాగుతోంది.

More Telugu News