: 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం ఇది: శ్వేతసౌధంలో మోదీ

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశం సోమవారం వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోదీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్, అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌లో తనకు దక్కిన అపూర్వ  ఆదరణ 125 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. ఈ సందర్భంగా 2014లో ట్రంప్ భారత పర్యటనను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన గురించి గొప్పగా చెప్పినందుకు ట్రంప్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు.

కాగా, మోదీ-ట్రంప్ మీటింగ్‌కు కొన్ని గంటల ముందు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన అమెరికా మోదీకి ఘన స్వాగతం పలికి పాకిస్థాన్ కు నేరుగా షాకిచ్చింది. మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో మెలానియా కూడా పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో విదేశీ నేతకు ట్రంప్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. తద్వారా మోదీకి ట్రంప్ ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 2014లో ఒబామా హయాంలో మోదీ అమెరికాలో పర్యటించినప్పటికీ వైట్‌హౌస్‌లో ఆయన విందుకు హాజరు కాలేదు. అప్పట్లో మోదీ నవరాత్రి ఉపవాస దీక్షలో ఉండడమే కారణం.

More Telugu News