: ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడమే మా లక్ష్యం.. స్పష్టం చేసిన మోదీ, ట్రంప్

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడంతోపాటు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన ప్రాంతాల పనిపట్టడమే తమ ప్రధాన లక్ష్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదే తమ లక్ష్యమని నొక్కి వక్కాణించారు. వైట్‌హౌస్‌లో ఇద్దరు నేతల సమావేశం అనంతరం అక్కడి రోజ్ గార్డెన్‌లో ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన చేశారు. హెచ్-1బీ వీసా, పారిస్ క్లైమేట్ ఎకార్డ్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు వివరించారు.

ట్రంప్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక లక్ష్యాలను పరస్పరం పంచుకున్నట్టు ట్రంప్ తెలిపారు. మోదీకి, తనకు ఒక సారూప్యత ఉందని, ఇద్దరికీ సోషల్ మీడియాపై ఆసక్తి ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తాను, మోదీ ప్రపంచంలోనే టాప్‌గా ఉండడం తనకు ఆనందంగా ఉందని ట్రంప్ తెలిపారు. తాను అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారం చేసినప్పుడు భారత్ ఒక నిజమైన మిత్రదేశాన్ని పొందనుందని చెప్పానని, అదిప్పుడు నిజమైందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానికి స్వాగతం పలకడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.

 
 

More Telugu News