: జీఎస్టీని అమలు చేయకుంటే కశ్మీర్‌కే నష్టం: అరుణ్ జైట్లీ

జమ్ముకశ్మీర్‌లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలు చేయకుంటే అది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఈ మేరకు కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి లేఖ రాశారు. శాసనసభ ఆమోదం లేకుండానే జీఎస్‌టీని ఆమోదించే విశేష అధికారం రాష్ట్రానికి ఉందని, ఆర్టికల్ 370 ఆ అధికారాన్ని కట్టబెట్టిందని గుర్తు చేశారు. కాబట్టి జీఎస్‌టీని ఆమోదించాలని కోరారు. జీఎస్‌టీని అమలు చేయకుంటే ఆ ప్రభావం రాష్ట్రంపై చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తువులు కొనుగోలు చేసే వస్తువుల ధరలతోపాటు ఇతర రాష్ట్రాలకు విక్రయించే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని, ఫలితంగా స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి జీఎస్‌టీలో చేరాలని, అందుకు ఆర్టికల్ 370 కల్పించిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. లేదంటే ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జైట్లీ వివరించారు. జీఎస్‌టీని అమలు చేయకుంటే జీఎస్‌టీని డీలర్లు భరించకుండా ఆ మొత్తాన్ని వస్తువుల ధరల్లో కలిపేస్తారని, అది ప్రజలకు పెను భారంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News