: చెన్నై జైలుకి మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన శశికళ

బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తనను చెన్నై జైలుకి మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో శశికళతో న్యాయవాదులతో పాటు దినకరన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తరచూ ములాఖాత్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందిని తొలగించేందుకు, ఆమెకు మెరుగైన సేవలందించేందుకు తమిళనాడులోని జైలుకు తరలించాలని పళనిస్వామిని ఆదేశించాలని ఆమె న్యాయవాదులు ఆమెకు సూచించినట్టు సమాచారం. అయితే దీనిని ఆమె తోసిపుచ్చారని తెలుస్తోంది. పరప్పన అగ్రహార జైలులో సమస్యలు లేవని, తమిళనాడు జైలులో ఉంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News