: పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. జననాంగాలు కోసేసిన ప్రియురాలు.. బాధితుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు!

పెళ్లికి నిరాకరించిన ప్రియుడి జననాంగాలను కోసేసిన ప్రియురాలిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. ఢిల్లీ శివారులోని మంగోల్‌పురికి చెందిన చిరు వ్యాపారి రవి(35), నాలుగేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. బుధవారం గాళ్ ఫ్రెండ్ పిలుపు మేరకు ఆమె ఇంటికి వెళ్లాడు. మాటల మధ్యలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, తాను పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియురాలు రవిని బాత్‌రూములోకి తీసుకెళ్లి తనతో శృంగారం చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అందుకు అతడు నిరాకరించడంతో కూరగాయలు తరిమే కత్తితో జననాంగాలను కోసేసింది.

ఆ సమయంలో యువతి  సోదరుడు, వదిన ఇంట్లోనే ఉన్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారు చూస్తూ ఉన్నారే తప్ప నిలువరించేందుకు ప్రయత్నించలేదని ఆరోపించాడు. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడిని జైపూర్‌లోని గోల్డెన్ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత నిందితురాలు సహా కుటుంబ సభ్యులందరూ పరారయ్యారు. ఎట్టకేలకు ఆదివారం వారిని  పట్టుకున్నారు. నిందితురాలి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News