: ఒక్క మచ్చ కూడా లేని ప్రభుత్వం నాది: నరేంద్ర మోదీ

విదేశీ వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలంగా ఉన్న దేశాల్లో ఇండియా ముందు నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికాలో 21 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశమైన మోదీ ప్రసంగిస్తూ, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయినా, ఒక్క అవినీతి మరక కూడా పడలేదని అన్నారు. జీఎస్టీ అమలుతో ఏకీకృత పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించామని, పన్ను సంస్కరణల్లో ఇది అత్యంత కీలకమైనదని ఆయన అభివర్ణించారు.

పాకిస్థాన్ పై భారత్ చేసిన సర్జికల్ దాడులను ప్రపంచంలోని ఒక్క దేశం కూడా ఖండించలేదని ఆయన గుర్తు చేశారు. అమెరికాతో కలసి, పరస్పర లబ్ధి లక్ష్యంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలన్నదే తమ అభిమతమని తెలిపారు. అమెరికన్ కంపెనీలు ఈ దిశగా, పెట్టుబడులు పెట్టి, లాభపడేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జీఎస్టీ సహా 7 వేలకు పైగా సంస్కరణలను తమ ప్రభుత్వం తీసుకు వచ్చిందని, ఇవన్నీ ఇండియాను ముందుకు తీసుకు వెళుతున్నాయని అభివర్ణించారు. కాగా, ప్రధాని మోదీతో సమావేశానికి గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, అమేజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, యాపిల్ చీఫ్ టిమ్ కుక్, మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా తదితరులు హాజరయ్యారు.

More Telugu News