: నాటి ఎమర్జెన్సీ గురించి కొత్తతరం తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు

నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ గురించి కొత్తతరం తెలుసుకోవాలని, ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయమని, ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వాళ్లందరినీ నాడు జైల్లో పెట్టారని, ఇందిరాగాంధీ కోసమే దీనిని విధించారని విమర్శించారు. నాడు ప్రజాప్రతినిధుల కాలాన్ని ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచుకున్నారని, దేశ వ్యాప్తంగా ప్రజల నిరసనలతో ఎమర్జెన్సీని ఎత్తివేశారని వెంకయ్యనాయుడు అన్నారు.

More Telugu News