: తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణం చెప్పిన రవితేజ!

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు అంత్యక్రియలు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని రవితేజ మరో సోదరుడు రఘు నిర్వహించారు. భరత్ అంత్యక్రియలకు ఆయన మిత్రులు, సహనటులు హాజరయ్యారు. అయితే, రవితేజ, మిగిలిన కుటుంబ సభ్యులెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా రవితేజ స్పందిస్తూ, ఎందుకు హాజరు కాలేకపోయామనే విషయాన్ని మిత్రులు, మీడియా అర్థం చేసుకోవాలని కోరారు. ఛిద్రమైపోయిన భరత్ భౌతికకాయాన్ని చూసి భరించలేనంటూ కుమిలిపోయిన రవితేజ, తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

More Telugu News