: బీఫ్ తింటున్నాడని చెబితే, మద్యం మత్తులో చంపేశాను: కలకలం రేపిన రైలు కేసులో నిందితుడి ఒప్పుకోలు

పశు మాంసం తింటున్నాడని తన స్నేహితులు చెబితే, మద్యం మత్తులో తాను యువకుడిని కొట్టి హత్య చేశానని నిందితుడు రమేష్ అంగీకరించాడు. హర్యానాలోని ఓ రైలు బోగీలో 16 ఏళ్ల ముస్లిం యువకుడి హత్యోదంతం సంచలనం రేపగా, పోలీసులు రమేష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు బీఫ్ తింటున్న విషయం చెప్పాడని, ఆపై కోపంతోనే తాను ఈ ఘటనకు పాల్పడ్డానని అన్నాడు.

 కాగా, పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ లో పశుమాంసం గురించి ప్రస్తావించలేదు. రైల్లోని తోటి ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, సీట్ల విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణమని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘటనకు ముందు యువకుడు, నిందితుల మధ్య మతపరమైన వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. హసీబ్, షకీర్, మొహసిన్ అనే యువకులను ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలోని అసావతీ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లోంచి నెట్టివేసిన నిందితులు, జునైద్ ను చిత్రవధ చేసి హత్య చేశారు. రంజాన్ షాపింగ్ కోసం హర్యానా నుంచి ఢిల్లీకి బాధితులు వచ్చారని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News