: త్వరలో చైనా, జపాన్‌, కొరియా, తైవాన్‌లలో ‘బాహుబలి-2’ విడుదల

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రాన్ని త్వరలోనే జపాన్‌, కొరియా, తైవాన్‌లో విడుదల చేయనున్నారు. ఇక‌ దంగల్ ప్రభంజనం సృష్టించిన చైనాలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో బాహుబ‌లి-2ను నాలుగు వేల సినిమా థియేట‌ర్ల‌లో విడుదల చేయ‌నున్నారు. ఆయా దేశాల్లోనూ ఈ సినిమా విడుద‌లైన త‌రువాత వ‌చ్చే రికార్డుల‌పైనే సినీ అభిమానుల దృష్టి ఉంది. మ‌రోవైపు భార‌తీయ అభిమానుల మ‌న‌సుల‌ను దోచుకున్న ఈ సినిమాకి సంబంధించి ‘బాహుబలి - ది లాస్ట్‌ లెజెండ్స్‌’ పేరుతో యానిమేషన్ ఎపిసోడ్‌లు కలర్స్ టీవీలో త్వ‌ర‌లోనే ప్రసారం కానున్నాయి.     

More Telugu News