: కెప్టెన్ సంపాదనలో 60 శాతం వేతనం కోచ్ కు ఇవ్వాలి: బీసీసీఐకి కుంబ్లే ప్రతిపాదన

టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన అనిల్ కుంబ్లే బీసీసీఐకి ఇంతకుముందు కొన్ని ప్రతిపాదనలు చేశాడు. దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ ను అడ్వైజరీ కమిటీకి కుంబ్లే అందజేశాడు. మే 21వ తేదీన కుంబ్లే అందజేసిన ఈ ప్రెజెంటేషన్ వివరాలను పీటీఐ తాజాగా ప్రచురించింది.

కోచింగ్ స్టాఫ్ కు ఇస్తున్న వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందని తన ప్రతిపాదనలో కుంబ్లే పేర్కొన్నాడు. జట్టు కెప్టెన్ సంపాదిస్తున్న మొత్తంలో కనీసం 60 శాతమైనా చీఫ్ కోచ్ కు చెల్లించాలని డిమాండ్ చేశాడు. జాతీయ స్థాయి కోచ్ లకు కూడా దీన్ని వర్తింపచేయాలని కోరాడు. దీనికితోడు, ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో పెట్టుకుని వారికి చెల్లిస్తున్న మొత్తంలో 20 శాతం మొత్తాన్ని వేరియబుల్ పేగా మార్చాలని సూచించాడు. అంటే ఫిట్ నెస్ సరిగా లేని ప్లేయర్లు తమ వేతనంలో కొంత మేర కోల్పోవాల్సి ఉంటుందన్నమాట.

More Telugu News