: ఈ నెల 30 అర్ధరాత్రి నుంచి ఏపీలో కనుమరుగు కానున్న చెక్ పోస్టులు!

ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి మూతపడబోతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ (దేశ వ్యాప్తంగా ఒకే పన్ను) అమల్లోకి రానుండటంతో చెక్ పోస్టుల అవసరం లేకుండాపోతోంది. చెక్ పోస్టుల్లో వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఇకపై ఉండదు.

అయితే, అనుమానం వచ్చిన వాహనాలను మాత్రం మార్గమధ్యంలో ఎక్కడైనా తనిఖీలు చేస్తారు. ఈ విషయాన్ని ఏపీ ఆర్థిక, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. చెక్ పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బందిని వాణిజ్య పన్నుల శాఖలోని ఇతర విభాగాల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి ప్రతి ఏటా రూ. 2,920 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు.

More Telugu News