: 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికొస్తోంది... 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదు: ఫైరైన సిద్ధూ

పంజాబ్ లో అగ్నిమాపక సిబ్బంది పనితీరుపై మాజీ క్రికెటర్, రాష్ట్ర మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పంజాబ్ లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అందులో కాలం చెల్లినవి 100 ఉంటే, సమర్థవంతమైనవి కేవలం 50 అని చెప్పారు. ప్రస్తుతం పిజ్జాను ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూటిగా సూచించారు. 

More Telugu News