: ‘అధినేత’ అనుకుంటున్నావా?: కోహ్లీపై మండిపడ్డ మాజీ క్రికెటర్‌

ఎంతో విన‌యం గ‌ల కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విరాట్ కోహ్లీ ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరు ప‌ట్ల విమ‌ర్శ‌లు ఎదురవుతున్నాయి. ఇటీవ‌లే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన అనిల్ కుంబ్లేకి, కోహ్లీకి మ‌ధ్య త‌లెత్తిన విభేదాలే అందుకు కార‌ణం. కోహ్లీ తీరుపై స్పందించిన మాజీ క్రికెటర్‌ ఎర్రాపల్లి ప్రసన్న టీమిండియాకు అతనికతడే ‘అధినేత’ అనుకొంటే జట్టుకు కోచ్‌ అవసరం లేదంటూ ఆయ‌న మండిప‌డ్డారు.

టీమిండియాకు అంతా ఆయ‌నే అయితే ఇక‌ బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల (సంజయ్‌ బంగర్‌, శ్రీధర్‌) సేవలు కూడా అవసరం లేదని త‌న‌కు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కోహ్లీ మంచి ఆటగాడే కానీ మంచి కెప్టెన్ అవునో కాదో త‌న‌కు తెలియదని అన్నారు. అనిల్‌ కుంబ్లే లాంటి గొప్ప  మాజీ ఆట‌గాడినే కోహ్లీ గౌరవించకపోతే ఇక ఇత‌ర కోచ్‌లకు ఆయ‌న ఎలా గౌర‌వం ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. కుంబ్లేతోనే ఇలా ప్ర‌వ‌ర్తించే కోహ్లీతో మాట్లాడగల కనీస ధైర్యం, ఆత్మవిశ్వాసం బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లకు ఎలా ఉంటుంద‌ని నిల‌దీశారు.

More Telugu News