: మీరూ మీరు చూసుకుంటే నా సంగతేంటి?: ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ను ఇరకాటంలో పెట్టిన విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ

ఇండియాలో అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజంగా అవతరించాలన్న కోరికతో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ సంస్థలు విలీనం కావాలని చేస్తున్న ప్రయత్నాలను విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ అడ్డుకుని ఇరకాటంలో పడేశారు. ఈ డీల్ ఆమోదం పొందితే, రెండు సంస్థల్లో ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. స్నాప్ డీల్ లో పెట్టుబడులు పెట్టిన అజీం ప్రేమ్ జీ, ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన తరువాతనే ముందడుగు వేయాలని డిమాండ్ చేశారు. అజీం ప్రేమ్ జీ ఇన్వెస్ట్ తరఫున స్నాప్ డీల్ వాటాలను కొన్న ఆయన, డీల్ పై పూర్తి క్లారిటీ ఇచ్చాకే ముందడుగు వేయాలని చెప్పడంతో, విలీనం ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.

విలీన ప్రక్రియలో భాగంగా స్నాప్ డీల్ వ్యవస్థాపకులకు, మరో ఇద్దరు ఇన్వెస్టర్లకు ప్రత్యేక చెల్లింపులు చేయాలని ఫ్లిప్ కార్ట్ నిర్ణయించండం, ఆ జాబితాలో ప్రేమ్ జీ పేరు లేకపోవడమే తాజా వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఉద్యోగులకు 30 మిలియన్ డాలర్లను పంచాలన్న బోర్డు నిర్ణయాన్ని సమ్మతిస్తూనే, వాటాదారులు, వ్యవస్థాపకులకు ఇద్దామనుకున్న 90 మిలియన్ డాలర్ల అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీని వల్ల వ్యవస్థాపకులకే తప్ప, పెట్టుబడులు అందించి, సంస్థను నిలిపిన తమలాంటి వారికి మేలు ఏంటని ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ప్రశ్నిస్తోంది.

More Telugu News