: ఆలస్యంగా నిద్రపోతున్నారా?.. ప్ర‌మాదమే అంటున్న ప‌రిశోధ‌కులు

రాత్రిపూట ఆల‌స్యంగా నిద్ర‌పోతున్నారా? అటువంటి అల‌వాటును మానుకోవాల్సిందేన‌ని న్యూయార్క్‌లోని బింగ్హాంటన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ మెరీడిత్ కోల్స్ అంటున్నారు. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. తాము చేసిన ఓ అధ్యయన ఫ‌లితాల‌ను తాజాగా ఆయ‌న‌ వెల్ల‌డించారు. త‌మ ప‌రిశోధన‌లో భాగంగా 20 మంది వ్యక్తులను పరిశీలించామ‌ని, వారిలో మానసిక రుగ్మతలకు కారణాలు ఏంటో తెలుసుకున్నామ‌ని అన్నారు. వారంతా ఆలస్యంగా నిద్రపోతున్నార‌ని, దీంతో పునరావృత ప్రవర్తనకు దారితీసే సాధారణ రుగ్మతతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింద‌ని అన్నారు.

అందులో పది మందికి ఒబెసిసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఉంద‌ని అన్నారు. వారు నిద్ర పోతోన్న‌ సమయం, వారి ఆలోచనలు, ప్రవర్తనలపై ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగా ఈ విష‌యం తెలిసింద‌ని అన్నారు. అసాధారణ సమయంలో నిద్రపోవ‌డంతో ఆ అంశం వారి మెదడు పనితీరుపై ప్రభావం చూపించింద‌ని అన్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి అధికమవుతాయని తెలిపారు.    

More Telugu News