: టీవీ ఆర్టిస్టు రూప అత్యాచార ఘటనలో అసలేం జరిగింది?

హైదరాబాదులోని ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో నివసించే టీవీ నటి రూప ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో ఒక స్నేహితురాలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీవిద్యాదుర్గా మెడికల్స్ నిర్వాహకుడు కొమర్‌ శెట్టి గిరీష్‌ (27) ను పరిచయం చేసింది. పరిచయం పెరగడంతో ఆమె లక్ష రూపాయలు చేబదులుగా అడగడంతో అతను ఇచ్చాడు. తరువాత గత నవంబర్ లో హైదరాబాదులోని ఆమె నివాసానికి ష్యూరిటీ పేపర్లపై సంతకాలు చేయాలంటూ వెళ్లాడు. అక్కడ ఆమె దృష్టి మరల్చి కూల్‌ డ్రింక్‌ లో నిద్రమాత్రలు కలిపాడు. ఇది తెలియని ఆమె వాటిని తాగి, మాట్లాడుతుండగానే నిద్రమత్తులోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై అత్యాచారం చేసి, ఫోటోలు, వీడియో తీశాడు.

మెలకువ వచ్చి, దారుణంపై నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా, తన సెల్ లో చిత్రీకరించినవి ఆమెకు చూపించి, అల్లరి చేస్తే మరింత అల్లరిపాలు కాకతప్పదని, సామాజిక మాధ్యమాల్లో వాటిని అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి బ్లాక్ మెయిల్ పర్వం మొదలైంది. పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం ఆమెను బెదిరించి ఆమెను అనంతపురం రావాలని సూచించాడు.

వెళ్లిన తర్వాత ఆమెను కల్యాణదుర్గంలోని ఓ ఇంటిలో లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా... తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆమె మెడలోని బంగారు నగలను తీసుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తాకట్టుపెట్టి 1.1 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆమె అడగడంతో తిరిగి వేధింపులకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ చేరిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో గిరీష్ ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు కటకటాలవెనక్కి నెట్టారు.

More Telugu News