: రాందేవ్ బాబా స్వగ్రామంలో ఎవ్వరూ యోగా చేయరు: రాందేవ్ చిన్ననాటి మిత్రుడు

ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా స్వగ్రామానికి వెళ్లిన మీడియా నిర్ఘాంతపోయింది. అసలు, ఆ గ్రామంలో యోగా వేడుకలే నిర్వహించ లేదు. రాందేవ్ బాబా స్వస్థలం హరియానా రాష్ట్రంలో మహేంద్రగడ్ లోని సైదిలిపూర్ గ్రామం. యోగా వేడుకలు ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయో చూసేందుకని మీడియా వర్గాలు అక్కడికి వెళ్లాయి.

 అయితే, యోగా వేడుకలు నిర్వహిస్తున్న దాఖలాలు ఎక్కడా కనపడలేదు. దీంతో, ఆ గ్రామ సర్పంచ్, రాందేవ్ బాబా చిన్ననాటి మిత్రుడు దేశ్ పాల్ నంబర్దార్ ని మీడియా వర్గాలు పలకరించాయి. ‘గ్రామంలో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా రాందేవ్ బాబా తలపెట్టిన కార్యక్రమాలేవీ గ్రామస్థులు పాటించరు. ఇక్కడ ఎవ్వరూ యోగా చేయరు. యోగా చేసే కొద్దోగొప్పో మంది తమ ఇళ్లలోనే చేసుకుంటారు’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ, రాందేవ్ బాబా ఇక్కడికి వచ్చిన సందర్భాలు లేవనే చెప్పవచ్చని, గ్రామానికి చెందిన నిరుద్యోగులు సాయం నిమిత్తం ఆయన్ని కలిస్తే పట్టించుకోలేదని, అందుకే, ఆయన పట్ల గౌరవం లేదని విమర్శించారు.

More Telugu News