: భూమిని ఏ క్షణంలోనైనా ఉల్క ఢీకొనవచ్చు... అందరూ సిద్ధంగా ఉండండి: ఐర్లండ్ శాస్త్రవేత్త ఫిట్జ్ సిమ్మన్స్

భూమిని ఉల్క ఢీకొనడం ఖాయమని... ఆ ఘటన కోసం ప్రపంచం మొత్తం సిద్ధం కావాల్సిందేనని ఐర్లండ్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిసిస్ట్ అలాన్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరించారు. 1908లో ఒక చిన్న ఉల్క సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని ఢీకొనడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనం అయిందని చెప్పారు. ప్రస్తుత తరుణంలో ఆ స్థాయి ఉల్క ఢీకొంటే ఒక పెద్ద నగరం భస్మీపటలం అవుతుందని తెలిపారు. అదే పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం అపారంగా ఉంటుందని చెప్పారు. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి, భూమికి సమీపంలో ఉన్న, మనకు హాని కలిగించే 1800 ఆస్టరాయిడ్స్ ను గుర్తించారని... అయితే, ఇంకా చాలా వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిరోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని, అయితే వాటి వల్ల హాని ఉండదని తెలిపారు. మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందని... అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చిరించారు. 

More Telugu News