: స్వామీజీ అత్యాచార యత్నం కేసు: ఆమెకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించి, నిజాన్ని నిర్థారించండి: న్యాయస్థానం ఆదేశం

తనపై అత్యాచారయత్నం చేయడంతో స్వామి గణేశానంద రహస్యాంగాన్ని కోసేశానని కేరళ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొని, మాట మార్చేసిన 'లా'విద్యార్థినిపై పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని త్రివేండ్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత మే 19న కేరళలోని స్వామి గంగేశానంద (56) తనపై అత్యాచారయత్నం చేశాడని, దాంతో ప్రతిఘటించి, అతని రహస్యాంగాన్ని కోసేశానని పోలీసులకు ఒక యువతి (23) ఫిర్యాదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఆమె మంచి పని చేసిందంటూ పలువురు ప్రశంసించారు. దీంతో స్వామి గంగేశానందపై పోలీసులు సెక్షన్ 376 (అత్యాచారం) లైంగిక నేర చట్టాలతోపాటు పిల్లల సంరక్షణ సెక్షన్ల (పోస్కో) కింద పోలీసులు అభియోగాలు మోపారు. దీంతో ఈ కేసును విచారిస్తున్న న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేయలేదు.

ఈ నేపథ్యంలో అతను రెండో సారి బెయిల్ కు దరఖాస్తు చేస్తూ, స్వామి గంగేశానంద తనకు తండ్రి లాంటి వాడని, తనపై అత్యాచారయత్నం చేయలేదని పేర్కొంటూ యువతి ఒక టెలిఫోన్ సంభాషణలో పేర్కొనడాన్ని కోర్టుకు సమర్పించారు. దీంతో బాధిత విద్యార్థినిని ప్రశ్నించగా, తాను స్వామిజీ మర్మాంగాన్ని కోయలేదని, పోలీసులే స్వామిజీకి వ్యతిరేకంగా అలా వాంగ్మూలం ఇవ్వాలంటూ ఒత్తిడి చేసి, కేసులు నమోదు చేయించారంటూ ఆరోపించింది. దీంతో స్వామీజీ కూడా తనకు మర్మాంగం ఉండి ఎలాంటి ప్రయోజనం లేదని, అందుకే తానే కోసుకున్నానని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును క్రైం బ్రాంచ్ విభాగానికి బదిలీ చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాలిగ్రాఫ్ పరీక్షలకు న్యాయస్థానం అనుమతిచ్చింది. పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించి, ఆమె చెప్పేది నిజమో? అబద్దమో? తేల్చాలని సూచించింది.

More Telugu News