: మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం నింగిలోకి 31 ఉపగ్రహాలు!

భారత అంతరిక్ష  పరిశోధన సంస్థ ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9:29 గంటలకు 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇందులో భారత్‌కు చెందిన 712 కేజీల బరువున్న ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం కార్టోశాట్-2తోపాటు మరో 30 నానో ఉపగ్రహాలున్నాయి. వీటిలో 29 విదేశీ ఉపగ్రహాలు కావడం గమనార్హం. ఇస్రో గెలుపు గుర్రం పీఎస్ఎల్‌వీ ద్వారా వీటిని నింగిలోకి పంపనున్నారు.

నింగిలోకి పంపనున్న మొత్తం ఉపగ్రహాల బరువు 955 కేజీలని ఇస్రో తెలిపింది. సూర్యానువర్తన కక్ష్యలో వీటిని ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. కాగా, పీఎస్ఎల్‌వీ మోసుకెళ్లనున్న  నానో ఉపగ్రహాల్లో 29 ఆస్ట్రియా, బెల్జియం, బ్రిటన్, చీలీ, చెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, లట్వియా, లిథువేనియా, స్లోకేవియా, అమెరికా దేశాలకు చెందినవి కాగా, ఒకటి తమిళనాడులోని ఓ కాలేజీ విద్యార్థులు రూపొందించినది.

More Telugu News