: హైదరాబాదులో ఫ్రీ వైఫై... 3000 హాట్ స్పాట్ సెంటర్లు!

హైదరాబాదు త్వరలో ఫ్రీ వైఫై సిటీగా పేరొందనుంది. హైఫై ప్రాజెక్టు పేరుతో 1,000 హాట్‌ స్పాట్‌ ప్రాంతాలను ప్రభుత్వం వివిధ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసింది. త్వరలో మరో 2,000 ప్రాంతాల్లో హాట్ స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. షాపింగ్‌ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్ లను ఇంటర్నెట్‌ కంపెనీల అపెక్స్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (కాయ్‌), ఎయిర్‌ టెల్, ఏసీటీ ఫైబర్‌ నెట్, ఇండస్‌ టవర్, సీఓఏఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ఏర్పాటు చేస్తోంది.

వైఫై నాణ్యత, బ్యాండ్‌ విడ్త్, డౌన్‌ లోడింగ్‌ స్పీడ్‌ విషయంలో కంపెనీలు పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం ఆయా సంస్థలకు ఇప్పటికే పంపింది. హాట్‌ స్పాట్‌ ల ద్వారా 5–10 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌ విండ్త్‌ వేగంతో రోజూ 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్‌ హైదరాబాదు ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2015 జూన్ లో డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ‘హైదరాబాద్‌ సిటీ వైఫై’ పేరుతో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 100 రద్దీ ప్రాంతాల్లో వైఫై హాట్‌ స్పాట్‌ లు ఏర్పాటు చేశారు. అది విజయవంతం కావడంతో నగరవ్యాప్తంగా ఫ్రీ వైఫై అందిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఈ విధానం అమలులో ఉంది. 

More Telugu News