: యూపీలో కొత్త చట్టం... ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటే చర్యలు తప్పవు

సెల్ఫీల పిచ్చిలో ప‌డి ఎంతో మంది ప్ర‌మాద‌క‌ర‌ పరిస్థితుల నడుమ సైతం త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌కు ప‌ని చెబుతూ ఉంటారు. ఇటువంటి వారికి చెక్ పెట్ట‌డానికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం రద్దీగా వుండే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవ‌డానికి వీలులేదు. నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా త‌మకిష్ట‌మొచ్చిన‌ట్లు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ సెల్ఫీలు తీసుకుంటే చట్టరీత్యా జరిమానా విధించ‌నున్నారు. ఈ నిబంధ‌న‌ల ప్రకారం రైల్వే స్టేషన్లు, రైల్వే పట్టాలు, హైవేలు, బహుళ అంతస్తుల భవనాల వ‌ద్ద సెల్ఫీలు తీసుకోకూడ‌దు. పోలీసులు తాము సెల్ఫీలు తీసుకునేటప్పుడు చూడ‌రు క‌దా అని అనుకోవ‌డానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సెల్ఫీలు సోష‌ల్ మీడియాలో క‌నిపించినా చర్యలు తీసుకుంటారు.        

More Telugu News