: కృష్ణమ్మకు జలకళ... ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు వరదనీరు

చాలా రోజుల తరువాత కృష్ణానదిలో జలకళ కనిపిస్తోంది. రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా బేసిన్ లోని ఆల్మట్టి రిజర్వాయర్ కు 1,875 క్యూసెక్కులు, నారాయణపూర్ కు 2,031 క్యూసెక్కులు, జూరాలకు 6,365 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయానికి 227 క్యూసెక్కలు, శ్రీశైలానికి 80 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ కు 400 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ లో 19.65 టీఎంసీలు, సాగర్ జలాశయంలో 118.17 టీఎంసీల నీరుంది. గోదావరి బేసిన్ లో మాత్రం ఇంకా వరదనీరు కనిపించడం లేదు.

More Telugu News