: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌కు అరుదైన గౌరవం.. ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక!

పాకిస్థాన్‌కు చాంపియన్స్ ట్రోఫీని అందించిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ‌కు అరుదైన గౌరవం లభించింది. ఓ మేజర్ టోర్నీ తర్వాత ఐసీసీ ప్రకటించే జట్టుకు ఆయనను కెప్టెన్‌గా నియమించింది. ఓ పెద్ద టోర్నీ తర్వాత ఇలా జట్టును ఎంపిక చేసి ఆటగాళ్లను గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం ప్రకటించిన ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్  జట్టుకు మొత్తం 12 మందిని ఎంపిక చేయగా ఇందులో నలుగురు పాకిస్థానీలు, ముగ్గురు భారతీయులు, ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు. ఓ బంగ్లాదేశీ ఆటగాడికి కూడా జట్టులో స్థానం లభించింది. న్యూజిలాండ్ జట్టు నుంచి కానే విలియమ్సన్‌ను 12వ ఆటగాడిగా ఎంపిక చేశారు.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు సభ్యులు వీరే..

 శిఖర్ ధవన్ (338 పరుగులు)
ఫఖర్ జమాన్ (252 పరుగులు)
విరాట్ కోహ్లీ (293 పరుగులు)
జోయ్ రూట్ (258 పరుగులు)
బెన్ స్టోక్స్ (184 పరుగులు, మూడు వికెట్లు)
సర్ఫరాజ్ అహ్మద్ -కెప్టెన్, వికెట్ కీపర్ (76 పరుగులు, తొమ్మిది మందిని పెవిలియన్ పంపాడు)
ఆదిల్ రషీద్ (ఏడు వికెట్లు)
జునైద్ ఖాన్ (8 వికెట్లు)
భువనేశ్వర్ కుమార్ (7 వికెట్లు)
హసన్ అలీ (13 వికెట్లు)
కానే విలియమ్సన్ (244 పరుగులు)
చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (338) చేసిన ధవన్‌కు గోల్డెన్ బ్యాట్ లభించగా, అత్యధిక వికెట్లు (13) పడగొట్టిన హసన్ అలీకి గోల్డెన్ బాల్ లభించింది.

More Telugu News