: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గురించిన విశేషాలు!

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించారు. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ నెల 23న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్ నాథ్  కోవింద్ గురించి క్లుప్తంగా..

* 1945, అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దెహత్ జిల్లా లోని పరాంఖ్ గ్రామంలో జన్మించారు.
* 1977-1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
* 1980-1993 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ లో పని చేశారు.
* యూపీ నుంచి 1994, 2006లో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
* పలు పార్లమెంట్ కమిటీల్లో పని చేశారు.
* ఎస్సీ/ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ, సామాజిక న్యాయం, సాధికారిత తదితర కమిటీల్లో సభ్యుడిగా, లక్నోలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ మేనేజ్ మెంట్ బోర్డులో, కోల్ కతా ఐఐఎం పాలకమండలి సభ్యుడిగా పని చేశారు.
* 1998-2002 వరకూ బీజేపీ దళిత్ మోర్చా అధ్యక్షుడిగా, అఖిల భారత్ కోలి సమాజ్ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
* 2015 ఆగస్టు 16 నుంచి బీహార్ గవర్నర్ గా రామ్ నాథ్ కోవింద్ కొనసాగుతున్నారు.

More Telugu News