: రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ ను నగదు రూపంలోనే చెల్లించాలట!

రాష్ట్రపతి అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ నిమిత్తం రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే సదరు అభ్యర్థులు చెల్లించాలని సంబంధిత అధికార వర్గాల సమాచారం. సదరు అభ్యర్థులు తమ డిపాజిట్ ను డిజిటల్ లేదా చెక్ రూపంలో చెల్లించేందుకు అనుమతిలేదని పేర్కొన్నాయి. కాగా, రాష్ట్రపతి పదవికి పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించే సమయంలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారి లెక్కించి సరి చూసుకుంటారు. అభ్యర్థులు చెల్లించాల్సిన మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయవచ్చు. సంబంధిత రసీదును నామినేషన్ పత్రాలకు జత చేస్తే సరిపోతుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రపతి అభ్యర్థులుగా ఇప్పటికే 15 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, సరైన పత్రాలు లేనందున ఏడుగురి నామినేషన్లను తిరస్కరించడం జరిగింది.

More Telugu News