: నాకింకా ఆ మ్యాచ్ గుర్తుంది... పదేళ్ల తరువాత ఆడుతున్న భారత్ గెలుస్తుంది: ఇర్ఫాన్ పఠాన్

సరిగ్గా పదేళ్ల తరువాత ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో టీమిండియా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. పదేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా, పాకిస్థాన్ తలపడనున్నాయని అన్నాడు. పదేళ్ల క్రితం జరిగిన మ్యాచ్ లో తాను కూడా భాగమయ్యానని చెప్పాడు. ఈ మ్యాచ్ తనకు ఇప్పటికీ గుర్తుందని అన్నాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే భారత బ్యాటింగ్ విభాగానికి, పాక్ బౌలింగ్ విభాగానికి మధ్య పోరాటం అని తెలిపాడు.

ఐసీసీకి సంబంధించిన ప్రతి టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా రాణిస్తుందని అన్నాడు. ఈసారి కూడా విజయం టీమిండియాదేనని తెలిపాడు. పాక్ తో మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదని, క్రికెట్ తో పాటు చాలా అంశాలు అభిమానులను ప్రభావితం చేస్తాయని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. పదేళ్ల క్రితం జరిగిన మ్యాచ్ అద్భుతంగా ఆడిన తమ జట్టు పాక్ పై విజయం సాధించి, టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియాదే విజయమని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. 

More Telugu News