: నో డౌట్.. టీమిండియాదే విజయం!: పాకిస్థాన్ కెప్టెన్ మేనమామ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ మేనమామ మెహబూబ్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధిస్తుందని.. పాక్ కు ఓటమి తప్పదని అన్నారు.

సర్ఫరాజ్ తల్లి ఆక్విలా బనోకి మెహబూబ్ హాసన్ స్వయానా సోదరుడు. ఈయన మన దేశంలోనే ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఇత్వాలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇత్వా వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో క్లర్క్ గా పని చేస్తున్నారు. ఆయన వయసు 52 ఏళ్లు. షకీల్ అహ్మద్ తో వివాహం జరిగిన అనంతరం సర్ఫరాజ్ తల్లి కరాచీకి వెళ్లిపోయింది. నాలుగేళ్ల వయసులో సర్ఫరాజ్ తొలిసారి తన మేనమామను చూశాడు. 2015లో కరాచీలో జరిగిన సర్ఫరాజ్ పెళ్లికి హాసన్ వెళ్లారు.

భారత్-పాక్ ల మధ్య ఫైనల్స్ గురించి సర్ఫరాజ్ మేనమామ మాట్లాడుతూ, తన మద్దతు ఇండియాకే అని చెప్పారు. తానే కాదు, తన పిల్లలు కూడా భారత్ కే మద్దతిస్తారని తెలిపారు. తన మేనల్లుడు ఆడుతున్నాడని తాను ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని... అతని జట్టు తరపున అతను ఆడుతున్నాడని చెప్పారు. టీమిండియాతో పాక్ జట్టును పోల్చలేమని... ట్రోఫీ భారత్ దే నని తెలిపారు.

More Telugu News