: విశాఖ, కాకినాడ, హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ బాండ్లు త్వరలో

స్మార్ట్ సిటీల రూపకల్పన దిశగా దేశంలోని ప్రముఖ పట్టణాలు, నగరాలు బాండ్ల రూపంలో నిధులు సమీకరించనున్నాయి. ముందుగా మహారాష్ట్రలోని పుణె నగరం మున్సిపల్ బాండ్లు ఈ నెల 22న బోంబే స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ కానున్నాయి. పుణె మున్సిపల్ కార్పొరేషన్ రూ.2,264 కోట్లు సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఐదేళ్ల కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో రూ.200 కోట్ల నిధుల సమీకరణకు కార్పొరేషన్ నడుంబిగించింది. 24 గంటల పాటు నీటి సరఫరా అందించేందుకు గాను ఈ నిధులను వినియోగించనుంది. పుణె తరహాలోనే స్మార్ట్ సిటీలుగా ఎంపికైన మరో 15 మున్సిపల్ కార్పొరేషన్లు సైతం నిధుల సమీకరణకు వీలుగా కేంద్రం లావాదేవీ సలహాదారులను నియమించింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, కాకినాడతోపాటు ఇతర రాష్ట్రాల్లోని నగరాలున్నాయి.

More Telugu News