: మంత్రి అయి ఉండి పెట్రోల్ బంక్ నడుపుతారా... లాలూ కుమారుడికి బీపీసీఎల్ షాక్

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పేరిట కొనసాగుతున్న పెట్రోల్ బంక్ లైసెన్స్ ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రద్దు చేసింది. పెట్రోల్ పంపు కేటాయింపుపై వివరణ కోరుతూ కంపెనీ లోగడే మంత్రికి షోకాజు నోటీసు కూడా పంపింది. తప్పుడు సమాచారం ఆధారంగా తేజ్ ప్రతాప్ యాదవ్ అనిసాబాద్ బైపాప్ రోడ్డులో పెట్రోల్ బంక్ లైసెన్స్ పొందారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీపీసీఎల్ ఈ చర్య తీసుకుంది. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే స్థలం తన పేరిట ఉందని యాదవ్ తప్పుడు సమాచారం ఇచ్చారని, వాస్తవానికి ఆ భూమికి హక్కుదారుడు ఏకే ఇన్ఫోసిస్టమ్ అని ఫిర్యాదు దారుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ నోటీసుకు 15 రోజుల్లోగా తేజ్ ప్రతాప్ యాదవ్ బదులివ్వాల్సి ఉంటుంది.

More Telugu News