: డార్జిలింగ్ కు మరిన్ని కేంద్ర బలగాలు... కుదుటపడని పరిస్థితులు!

పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా రాష్ట్రానికి మరిన్ని కేంద్ర భద్రతా బలగాలను పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజా పరిస్థితులపై ఎటువంటి నివేదిక అందలేదు. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) ఇచ్చిన నిరవధిక బంద్ పిలుపు మేరకు వరుసగా ఆరో రోజూ బంద్ కొనసాగుతోంది. ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్టు సమాచారం.

జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ నివాసంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడడం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఆ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు  నిన్న రాత్రి పోలీసులు జీజేెఎం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమంగ్ నివాసాన్ని ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జీజేఎం మద్దతుదారులు మిరిక్ లో పంచాయతీ ఆఫీస్, లోదమాలో హైడ్రో ఎలక్ట్రిక్ సరఫరా కార్యాలయానికి, రింబిక్ లో ఆరోగ్య కేంద్రానికి నిప్పు పెట్టారు. బంద్ కారణంగా పర్యాటకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

More Telugu News