: ‘రంజాన్’ విందుల పేరిట ప్రభుత్వ నిధులు దుర్వినియోగం.. హైకోర్టులో పిల్ దాఖలు

రంజాన్ మాసంలో తోఫాలు, ఇఫ్తార్ విందుల పేరిట ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఓ పిల్ దాఖలు అయింది. సామాజిక కార్యకర్త డాక్టర్ లుగ్నా సార్వత్ దాఖలు చేసిన ఈ పిల్ పై ఈ రోజు విచారణ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుల్లో పేద ముస్లింల బదులు ధనవంతులు, ముస్లిమేతరులు పాల్గొంటారని, ఈ విందులను ఆపాలని ఆ పిల్ లో కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఈ దశలో ఇఫ్తార్ విందులు ఆపలేమని తేల్చి చెప్పింది. ఇఫ్తార్ విందుల్లో ఎంత మంది పాల్గొంటున్నారు, ఖర్చులు తదితర వివరాలతో కూడిన నివేదికను మూడు వారాల్లోగా  తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని,మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కాగా, పేద ముస్లింలకు ప్రయోజనం కలిగేందుకే ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు మైనార్టీ నిధులను వినియోగించమని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏఏజీ హామీ ఇచ్చారు.

More Telugu News