: యువీ ఓ సూపర్ స్టార్.. అతడు లేని జట్టును ఊహించలేం: రాహుల్ ద్రవిడ్

టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ పై మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు పదిహేడేళ్లుగా సేవలందిస్తున్న యువీ ఎంతో నిరాడంబరంగా ఉంటారని, యువీ ఓ సూపర్ స్టార్ ఆటగాడని కితాబిచ్చాడు. ఆల్ టైం భారత ఎలెవన్ క్రికెట్ జట్టులో యువీ తప్పక ఉంటాడని, అతని లేని జట్టును ఊహించలేమని అన్నాడు. ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించే యువీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగూ అద్భుతమని, అతనిని 'వన్డే క్రికెట్ కెరీర్ సంచలనం'గా రాహుల్ ద్రవిడ్ అభివర్ణించాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ వన్డే యువీకి 300వది. భారత్ తరపున ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా యువీ రికార్డులకెక్కడం విశేషం.

More Telugu News