: 24 ఏళ్ల ఉత్కంఠకు నేడు తెర... తేలిపోనున్న అబూసలేం జాతకం!

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ అబూసలేం జాతకం నేడు తేలిపోనుంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా నేరసామ్రాజ్యాన్ని నడిపించిన అబూసలేంపై దాఖలైన ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు నేడు తీర్పు వెలవరించనుంది. 12 మార్చి 1993న ముంబై మహానగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉన్మాద పాకిస్థాన్ ప్రేరణతో జరిగిన ఈ దారుణ మారణకాండలో భారీ సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 12 చోట్ల బాంబు పేలుళ్లు ఏకకాలంలో జరగగా, 257 మంది మృతి చెందారు. మరో 715 మందికి తీవ్రగాయాలపాలయ్యారు. దీనిపై టాడా కోర్టు సుదీర్ఘ విచారణ జరుపుతోంది. ఈ కేసులో గ్యాంగ్ స్టర్ అబూసలేంతో పాటు ఆరుగురిపై అభియోగాలు నమోదై ఉన్నాయి. ఈ దారుణంలో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ పారిపోయి, కరాచీలో తలదాచుకుంటున్నాడు. 

More Telugu News