: స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచార యత్నం చేసిన ప్రబుద్ధుడి అరెస్టు!

స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారయత్నం చేసిన ప్రబుద్ధుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... బెంగళూరు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో సాదహళ్లి గేట్ వద్ద ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. ఆ దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ మధ్యే ఆ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరోక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన మొదటి భార్య వద్దకు స్నేహితుడు రవిని తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి బాగా మద్యం తాగారు.

అనంతరం తన స్నేహితునితో పక్క పంచుకోవాలని భార్యను బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరూ కలిసి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో మరోగదిలో నిద్రిస్తున్న ఆమె తల్లి వచ్చింది. ఆమెను చూసిన ఆ ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మోసం, అత్యాచారయత్నం, వేధింపులపై కేసులు నమోదు చేశారు. స్నేహితుడు రవితోపాటు అతనిని రిమాండ్ కు పంపించారు.

More Telugu News