: అధికారులు అవినీతిలో రాజకీయ నాయకులను మించిపోతారు:! గోవా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

అధికారులకు కనుక రాజ్యాంగ బద్ధంగా పూర్తి అధికారాలు ఇస్తే, అవినీతిలో రాజకీయ నాయకులను వారు మించిపోతారని గోవా సీఎం మనోహర్ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు సంబంధించి రూ.16.80 కోట్లు ఖర్చైనట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు లెక్కలు చూపించారు. ఈ రోజు జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల అధికారులు కోరారు. దీంతో ఈ లెక్కలపై ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా పారికర్ మాట్లాడుతూ, రెండున్నర నెలల ఎన్నికల విధుల్లో రూ.16.80 కోట్లు ఖర్చయినట్టు అధికారులు చూపించారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన అధికారులను తప్పుబట్టడం తన ఉద్దేశం కాదంటూనే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా అధికారులకు పూర్తి అధికారాలను కనుక వారికి కట్టబెడితే, అవినీతిలో రాజకీయ నాయకులను మించిపోతారని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులకు జవాబుదారీతనం ఉంటుందని, ఇలాంటి జవాబుదారీతనమే రాజ్యాంగబద్ధంగా నియమితులైన అధికారులకూ  ఉండాలని అన్నారు.

More Telugu News