: నకిలీ సర్టిఫికెట్లని తేలితే ఉద్యోగం ఊడినట్టే: కేంద్రం హెచ్చరిక

షెడ్యూల్డ్ తరగతులు, వెనుకబడిన వర్గాల వారిమంటూ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించిన వారిని కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. నకిలీ సర్టిఫికెట్లని తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలను, ప్రభుత్వ రంగ సంస్థలను కోరింది. సుమారు 1,800 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు ఆరోపణలు రావడంతో ఇలా స్పందించింది. తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినా ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించాలని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి.

More Telugu News