: గవర్నర్ కిరణ్ బేడీపై కేసు పెడతా: పుదుచ్చేరి ముఖ్యమంత్రి

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై మద్రాసు హైకోర్టులో కేసు వేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. పుదుచ్చేరి మెడికల్ పీజీ కోర్సులకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో దాఖలు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రైవేట్‌ వైద్యకళాశాలలు, డీమ్డ్‌ వర్శిటీల్లో వైద్యకోర్సులకు సంబంధించి 50 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కిందకు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం అశేషమైన కృషి చేసిందని తెలిపారు. ఈ విధానం తమిళనాడులోని డీమ్డ్‌ వర్శిటీల్లో లేదని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 50 శాతం ప్రభుత్వ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వాస్తవాలు పక్కనబెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తమ ప్రభుత్వం 71 మెడికల్‌ సీట్లను ప్రైవేట్‌ కళాశాలల పాలు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ పై మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నానని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.

More Telugu News