: రూ. 100 కోట్ల డీల్ ను జేబులో వేసుకున్న కోహ్లీ!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్, వన్డేల్లో నంబర్ వన్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో భారీ డీల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 8 సంవత్సరాల కాలానికి తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పెట్టేందుకు ప్రముఖ టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్ కోహ్లీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1990, 2000 దశకంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ లకు స్పాన్సర్ చేసిన ఎంఆర్ఎఫ్, ఆపై ఇప్పుడు ఓపెనర్ శిఖర్ ధావన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ లను స్పాన్సర్ చేస్తోంది.  

కాగా, స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ పూమాతో రూ. 100 కోట్ల విలువైన 8 ఏళ్ల కాంట్రాక్టును గతంలో కోహ్లీ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది కోహ్లీకి రెండో 100 కోట్ల డీల్. ప్రస్తుతం ఫోర్బ్స్ అత్యధిక ఆదాయాన్ని అర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో 89వ స్థానంలో ఉన్న కోహ్లీ, తాజా ఎంఆర్ఎఫ్ డీల్ తో మరింత పైకి రానున్నాడు. ఇటీవలే పెప్సీకోతో తన ఒప్పందాన్ని తెంచుకున్నానని కోహ్లీ ప్రకటించాడు. భారీ మొత్తం చెల్లించి కోహ్లీతో డీల్ కుదుర్చుకోవాలని పెప్సీకో ఇంకా తన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తాను వినియోగించని శీతల పానీయాలకు ప్రచారం చేయలేనని కోహ్లీ తెగేసి చెప్పిన విషయం విదితమే.

More Telugu News