: టర్కీ నోట్లు మార్చబోయి పట్టుబడ్డారు... 300 నోట్ల విలువ 274 కోట్లు!

వినియోగంలో లేని టర్కీ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నించిన ఏడుగురు హైదరాబాదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... నాగోల్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఉప్పల్ నుంచి నాగోల్ మీదుగా వెళ్తున్న ఒక వాహనంలో ఏడుగురు వ్యక్తులు వెళ్తున్నారు. వారిలో ఒక కానిస్టేబుల్ కూడా ఉండడం విశేషం.

ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, వారి దగ్గర టర్కీకి చెందిన వినియోగంలో లేని 300 కరెన్సీ 'లీరా'లు లభ్యమయ్యాయి. దీంతో వారిని ప్రశ్నించగా, వాటిని మార్చేందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఒక్కో లీరా ధర టర్కీ కరెన్సీలో 5 లక్షల (భారత కరెన్సీలో 91,40,000 రూపాయల) ని చెప్పారు. అలాంటి లీరాలు 300 తమ వద్ద ఉన్నాయని, వాటి ధర భారత కరెన్సీలో సుమారు 274.20,000 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News