: లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో మూడు టైటిళ్లు కొల్లగొట్టిన భారత బాలిక!

జార్జియాలో జరుగుతున్న లిటిల్ మిస్ యూనివర్స్ 2017 పోటీలకు ఎంపికై సంచలనం సృష్టించిన ఒడిశా బాలిక పద్మాలయ నందా మూడు టైటిళ్లు చేజిక్కించుకుంది. ‘లిటిల్ మిస్ యూనివర్స్ గ్రాండ్ పిక్స్’, ‘లిటిల్ మిస్ యూనివర్స్ ఇంటర్నెట్ 2017’, ‘లిటిల్ మిస్ యాక్ట్రెస్’ టైటిళ్లు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ పోటీలో కజక్‌స్థాన్‌కు చెందిన మిస్ డయానా అలింబయేవా లిటిల్ మిస్ యూనివర్స్ 2017 కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబరులో గ్రీస్‌లో జరగనున్న లిటిల్ మిస్ వరల్డ్ 2017 పోటీల్లోనూ పద్మాలయ పాల్గొననుంది.

More Telugu News