: పుతిన్ విధానాలకు వ్యతిరేకంగా రష్యాలో రోడ్డెక్కిన వేలాదిమంది యువత.. 1000 మంది అరెస్టు

రష్యాలో మరోసారి వేలాది మంది యువకులు రోడ్డెక్కి ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. త‌మ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విధానాలు,  రాజకీయాలు, తమ దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్య‌తిరేకంగా వారు నినాదాలు చేశారు. ఆ దేశ‌ ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీకి మరోసారి జైలుశిక్ష విధించడంతో ఆయన ఇచ్చిన‌ పిలుపుమేరకు ర‌ష్యా రాజ‌ధాని మాస్కో తో పాటు సుమారు 100 నగరాలు, పట్టణాల్లో ఈ ఆందోళ‌న‌లు చెల‌రేగాయి.

 ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను అణచివేసేందుకు పుతిన్ ప్ర‌భుత్వం నిరసనకారులను పెద్దసంఖ్యలో అరెస్టు చేయించింది. ఆందోళనలో పాల్గొంటున్న యువ‌త‌పై పోలీసులు విరుచుకుప‌డ్డారు. మాస్కోలో 700మంది, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పుతిన్ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఇంత పెద్ద‌గా ఆందోళ‌న‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌భుత్వంలో వ‌ణుకుపుట్టింది.        

More Telugu News