: అత్యంత వేగంగా పయనించే ద్విచర యుద్ధ వాహనాన్ని సిద్ధం చేస్తున్న చైనా

చైనా త‌మ ర‌క్ష‌ణ రంగంలో ఆయుధ సంప‌త్తిని మ‌రింత శక్తిమంతం చేసుకుంటోంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో ద్విచర యుద్ధ వాహనాలు ఉన్నా అవి స‌ముద్ర‌ జలాల్లో నిదానంగా ముందుకు వెళ‌తాయి. అయితే, చైనా ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్ల‌గ‌లిగే ద్విచర యుద్ధ వాహనాన్ని సిద్ధం చేస్తోంది. ఈ వాహ‌నం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ లోహకవచ ద్విచరయుద్ధ ఏఎఫ్‌వి వాహనాన్ని ఉత్తర చైనా వాహన పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తోంది. ద్విచ‌ర వాహ‌నాలంటే అటు నేలపైన ప్ర‌యాణించ‌డంతో పాటు నీటిలోనూ ప్రయాణిస్తాయి.      

More Telugu News