: ఇరాక్ లో ఇఫ్తార్ విందు వికటించి అస్వస్థతకు గురైన 900 మంది!

ఇఫ్తార్‌ విందు విక‌టించి దాదాపు 900 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న ఇరాక్‌లోని మోసుల్ న‌గ‌రంలో చోటు చేసుకుంది. రంజాన్ మాసం సంద‌ర్భంగా ఓ ప్రాంతానికి బ్రిటీష్ ఎన్జీవో ఆ ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేసింది. ఆ ఆహారాన్ని తిన్న కొద్దిసేప‌టికే అంద‌రూ వాంతులు, విరోచ‌నాలు చేసుకున్నారు. వారిలో చిన్నారులు, మ‌హిళ‌లు కూడా ఉన్నారు. మోసుల్‌, ఇబ్రిల్ న‌గ‌రాల మ‌ధ్య హ‌స‌న్‌ష్యామ్ యూ2 క్యాంపులో ఈ ఘ‌ట‌న చేసుకుంద‌ని, ఆ విందు ఆర‌గించిన వారందరూ డిహైడ్రేష‌న్‌కు గుర‌య్యారని అక్క‌డి అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం అక్క‌డి ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులను అంత‌మొందించేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే.  

More Telugu News