: దిగివచ్చిన కేంద్రం... ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదని వివరణ

ప్రజల అభిప్రాయాలను, ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా కేంద్రం ఒత్తిడి తెస్తుందన్న ఆరోపణలూ అవాస్తవమని కేంద్ర మంత్రి హర్ష వర్దన్ వెల్లడించారు. గో వధ, పశు మాంసం విక్రయాలపై తమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా, ఆయన వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు సూచనల మేరకే ముసాయిదా నిబంధనలను తయారు చేశామని, ప్రజల అభిప్రాయాలను కోరుతూ, నెల రోజుల పాటు దీన్ని వెబ్ సైట్లో ఉంచామని తెలిపారు. నిబంధనలు మార్చాలని కొన్ని సిఫార్సులు వచ్చాయని, ఆహారపు అలవాట్లను మార్చాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు. కాగా, కేంద్రం నోటిఫికేషన్ ను తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

More Telugu News