: యువరాజ్ సింగ్ కు ఊహించని సమాధానం ఇచ్చిన జహీర్ ఖాన్

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మాజీ సహచరుడు జహీర్ ఖాన్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ శ్రీలంక-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా....  90 బంతుల్లో 62 పరుగులు కావాలని ఇంకా పాకిస్థాన్ చేతిలో 3 వికెట్లు ఉన్నాయని జహీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. దానికి జహీర్ ఖాన్ ను ఆటపట్టిస్తూ....అబ్బా ఈ మధ్య భలే ట్వీట్లు చేస్తున్నావే అంటూ యువీ ట్వీట్ చేశాడు.

దీంతో జహీర్ యువరాజ్ కు సమాధానమిస్తూ...అవును నేను నీలా ట్వీట్లు చేస్తున్నాను...కానీ నువ్వేంటి నాలా ఫీల్డింగ్ చేస్తున్నావు? అంటూ ఎద్దేవా చేశాడు. ఈ ట్వీట్ల సంభాషణ వారిద్దరి అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ రెండు సార్లు మిస్ ఫీల్డ్ చేయడంతో ఒక బౌండరీ వెళ్లింది. దీంతో జహీర్ ఈ విధంగా స్పందించాడు. జహీర్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ తో వేగవంతమైన బంతులేసి టాప్ ఆర్డర్ వికెట్లు తీసేవాడు కానీ, ఫీల్డింగ్ విభాగంలో మాత్రం బలహీనంగా ఉండేవాడు. డైవ్ చేయడమంటే జహీర్ కు యుద్ధం చేసినట్టేనని అభిమానులు పేర్కొనేవారు.

 












More Telugu News